CM : లొంగిపోయే మావోయిస్టులకు మెరుగైన పునరావాసం.. వ్యవసాయ మంత్రితో సీఎం భేటీ

by Hajipasha |   ( Updated:2024-07-29 19:27:54.0  )
CM : లొంగిపోయే మావోయిస్టులకు మెరుగైన పునరావాసం.. వ్యవసాయ మంత్రితో సీఎం భేటీ
X

దిశ, నేషనల్ బ్యూరో : ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి సోమవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ అయ్యారు. పోలీసులకు లొంగిపోయే మావోయిస్టులకు పునరావాసం కల్పించే అంశంపై ఈసందర్భంగా వారి మధ్య ప్రధాన చర్చ జరిగింది. జన జీవన స్రవంతిలో కలిసిపోయిన మావోయిస్టులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీంలో ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర మంత్రిని ఛత్తీస్‌గఢ్ సీఎం కోరారు. ఈ లెక్కన తమ రాష్ట్రంలో దాదాపు 10,500 మంది అర్హులైన కుటుంబాలు ఉంటాయన్నారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా ఇంటర్నెట్ సౌకర్యం సరిగ్గా అందుబాటులోకి రానుందున.. ఆయాచోట్ల 2025 మార్చి 31 వరకు ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్ (ఏబీపీఎస్) అమలును ఆపేయాలని ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి కోరారు. ఆయా ప్రాంతాల్లో బ్యాంకు వసతులు తక్కువగా ఉన్నందున.. నగదు రూపంలో పేమెంట్స్ చేసేందుకు అనుమతించాలన్నారు. వీటిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌.. తప్పకుండా ఆయా అంశాలపై త్వరలోనే సానుకూల నిర్ణయాలు తీసుుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story