Suitcase Murder : మహిళను ముక్కలు చేసి.. సూట్ కేసులో వేసి..

by Hajipasha |
Suitcase Murder : మహిళను ముక్కలు చేసి.. సూట్ కేసులో వేసి..
X

దిశ, నేషనల్ బ్యూరో : తమిళనాడులోని చెన్నైలో దారుణ హత్య జరిగింది. గురువారం ఉదయం నగరంలోని ఐటీ కారిడార్‌ సమీపంలో ఉన్న తురైపాకం ప్రాంతంలో రోడ్డు పక్కన ఓ సూట్‌‌ కేసులో మహిళ మృతదేహం లభ్యమైంది. ఆమెను నగరంలోని మాధవరం ఏరియాకు చెందిన దీపగా గుర్తించారు. దీప కనిపించడం లేదంటూ రెండు రోజుల క్రితమే పోలీసులకు ఆమె కుటుంబీకులు ఫిర్యాదు చేశారని వెల్లడైంది. దీపను వేరే ప్రాంతంలో హత్య చేసి, శరీర భాగాలను ముక్కలుగా చేసి.. వాటితో నింపిన సూట్‌ కేసును తురైపాకం ఏరియాలో నిందితులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి మణి అనే అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూట్ కేసు లభ్యమైన ప్రదేశానికి కేవలం 100 మీటర్ల దూరంలోనే మణి నివసిస్తుంటాడని పోలీసులు చెప్పారు. ఇంకా ఈ దారుణ హత్యలో భాగస్తులుగా ఉన్న వారందరిని త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ అధారంగా విచారణను వేగవంతం చేశారు. చనిపోయిన మహిళ శరీర భాగాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story