Chennai: చెల్లెలిని వ్యభిచారంలోకి దింపిన మహిళ.. అరెస్ట్ చేసిన పోలీసులు

by S Gopi |
Chennai: చెల్లెలిని వ్యభిచారంలోకి దింపిన మహిళ.. అరెస్ట్ చేసిన పోలీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: చెల్లెలిని వ్యభిచారంలోకి దింపిన ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 14 ఏళ్ల బాలికను వ్యభించారంలోకి దింపినందుకు చెన్నై పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేసి మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన వారిలో బాలిక సోదరి కూడా ఉండటం గమనార్హం. పోలీసు అధికారుల తెలిపిన వివరాల ప్రకారం, చెమ్మంచెరి ప్రాంతంలో నివశిస్తున్న బాలిక(14) తన అక్కను కలిసేందుకు పదువంచెరికి వెళ్లింది. అక్కడ ఆ బాలికను తన అక్కతో పాటు ఆమె అత్త బలవంతంగా విభిచారంలోకి దింపేవారు. కేకే నగర్, చెంగల్పట్టు సహా పలు ప్రాంతాలకు తీసుకెళ్లేవారు. ఈ విషయంలో చెంగల్పట్టులోకి శిశు సంక్షేమ కమిటీ వారు పోలీసులకు సమాచారం అందించారు. సెలైయూర్ ఆల్ మహిళా పోలీసుల ప్రత్యేక బృందం బాలికను రక్షించింది. కాల్ రికార్డులు, విచారణ అనంతరం లక్ష్మీ, ప్రకాష్, దామోధరన్, కవిత, కర్పగం, శ్రీనివాసన్ అనే ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేసి, పలు నిబంధనల ప్రకారం అభియోగాలు మోపారు. ఇదే కేసులో మరో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. విచారణ జరుగుతోందని పేర్కొన్నారు.

Advertisement

Next Story