సముద్రంలో మునిగిపోనున్న చెన్నై!

by M.Rajitha |
సముద్రంలో మునిగిపోనున్న చెన్నై!
X

దిశ, వెబ్ డెస్క్ : మరి కొద్ది సంవత్సరాల్లోనే చెన్నై నగరం సముద్రంలో మునిగిపోతుంది. ఇదేదో ఊరికే అంటున్నమాట కాదు శాస్త్రవేత్తలు గత కొన్ని దశాబ్దాలుగా చేసిన పరిశోధనలు చెప్తున్న వాస్తవాలు. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ పెరుగుతున్న భూతాపం వల్ల 2040 వరకు మంచు ప్రాంతాలు విపరీతంగా కరిగి, ఆ నీరంత చివరికి సముద్రాలలో చేరి, తీర ప్రాంతాల్లోని నగరాలన్నీ సముద్రంలో మునగడం ఖాయం అంటున్నారు.

బెంగుళూరుకు చెందిన 'సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ స్టడీస్' సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులపై అధ్యయనం చేస్తోంది. ఈ అధ్యయనాల ప్రకారం మనదేశంలోని 15 నగరాలు ముంపు గండం ముందు ఉన్నట్టు తేలింది. ముఖ్యంగా ముంబై, చెన్నై, విశాఖపట్టణం వంటి నగరాలకు ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని చెబుతోంది. ఈ లిస్టులో ఉన్న చెన్నై నగరం 2040 సం. వరకు దాదాపు 87 చదరపు కిలోమీటర్ల భూభాగం సముద్రంలో కలవనుందట. ముఖ్యంగా చెన్నై హార్బర్, అడయార్ పార్క్, ఐలాండ్ గ్రౌండ్, పల్లిక్కరనై ప్రాంతాలు నీటిలో మునుగుతాయట. 2060 సం. నాటికి 115 చకిమీ, 2100 సం. నాటికి 210 చకిమీ మేర భూభాగం మునిగిపోతుందని అంచనా వేస్తోంది. వాతావరణ మార్పులు అధికం అయితే ఈ విస్తీర్ణం అమరింత పెరిగే అవకాశాలు ఉంటాయని అంటోంది. 1987 నుండి 2021 వరకు చెన్నైలో సముద్రమట్టం 680 సెం.మీ పెరగడం చూస్తుంటే మరి కొన్ని సంవత్సరాల్లోనే చెన్నైతోపాటు మరిన్ని తీరప్రాంతా నగరాలు సముద్రాలలో మునగడం నిజమేనని అనిపిస్తోంది.

Next Story

Most Viewed