వైరల్ వీడియో : అంచుల్లో పసికందు.. అరచేతుల్లో ప్రాణాలు.. ఏమైందంటే..

by Hajipasha |
వైరల్ వీడియో : అంచుల్లో పసికందు.. అరచేతుల్లో ప్రాణాలు.. ఏమైందంటే..
X

దిశ, నేషనల్ బ్యూరో : అది చెన్నైలోని ఓ హౌసింగ్ సొసైటీ. తల్లి ఒడిలో ఆడుకుంటున్న పసికందు ప్రమాదవశాత్తు కిటికీలో నుంచి కింద పడిపోయాడు. లక్కీగా అతడు అపార్ట్‌మెంట్ అంచుల్లో కప్పి ఉన్న ప్లాస్టిక్ షీట్ దగ్గర ఆగిపోయాడు. దీంతో అందరి గుండెలు వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టాయి. ఏ క్షణంలోనైనా అపార్ట్‌మెంట్ అంచుల్లో నుంచి పసికందు పడిపోతాడనే భయం అందరినీ ఆవరించింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఏం చేయాలో తోచక అపార్ట్‌మెంట్ వాసులంతా కలిసి ఓ పెద్ద వస్త్రాన్ని పట్టుకొని.. సరిగ్గా పసికందు కిందపడే అవకాశమున్న ప్రాంతంలో వలయంలా నిలబడ్డారు. ఏ క్షణమైనా పసికందు అందులో పడతాడని అందరూ భావించారు.

ఇదే టైంలో అపార్ట్‌మెంట్ పై అంతస్తులోని కిటికీలో నుంచి ఇద్దరు వ్యక్తులు పైకప్పు అంచులకు చేరుకునేందుకు యత్నించారు. ఓ వ్యక్తి చేరుకోలేకపోయాడు. మరో వ్యక్తి వచ్చి.. సాహసం చేసి.. అంచుల్లో దొర్లుతున్న పసికందును ఒంటి చేత్తో సురక్షితంగా పట్టుకొని కిటికీలో నుంచి ఇంట్లోకి వెళ్లాడు. అప్పటిదాకా ఇరుగుపొరుగు వారంతా ఊపిరి బిగబట్టుకొని ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను నిశితంగా గమనించారు. చాలామంది ఈ ఉత్కంఠభరిత ఘటనను వీడియోలు తీసి సోషల్ మీడియాలో వేశారు.

Advertisement

Next Story