చార్‌ధామ్ యాత్రకు భారీగా సందర్శకులు: పది రోజుల్లోనే ఆరు లక్షల మంది విజిట్

by samatah |   ( Updated:2024-05-20 09:28:37.0  )
చార్‌ధామ్ యాత్రకు భారీగా సందర్శకులు: పది రోజుల్లోనే ఆరు లక్షల మంది విజిట్
X

దిశ, నేషనల్ బ్యూరో: చార్ ధామ్ యాత్రకు వెళ్లే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. యాత్ర ప్రారంభమైన కేవలం పది రోజుల్లోనే 6,40,000 మంది చార్ ధామ్‌ను సందర్శించారు. ముఖ్యంగా కేదార్‌నాథ్ ధామ్‌కు 2.50 లక్షల మంది హాజరయ్యారు. ప్రతి రోజూ సుమారుగా 70,000 మంది యాత్రికులు సందర్శిస్తున్నట్టు అధికారులు తెలిపారు. యాత్ర కోసం 29.52 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు వచ్చినట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం పేరు నమోదు చేసుకోకుండా వెళ్లే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. చెక్ పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేసింది. కాగా, అక్షయ తృతీయ సందర్భంగా చార్ ధామ్ యాత్ర మే 10న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు కేదార్‌నాథ్ 2,46,820 మంది, బద్రీనాథ్: 1,20,757, యమునోత్రికి 1,25,608, గంగోత్రిని 1,12,508 మంది సందర్శించారు. యాత్రకు బయలుదేరే ముందు యాత్రికులు స్వయంగా పరీక్షలు చేయించుకోవాలని, ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించాలని అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story