Chandrayaan-3 : విక్రమ్, ప్రజ్ఞాన్‌ పునరుద్ధణ ప్రక్రియ వాయిదా

by Shiva |   ( Updated:2023-09-22 11:39:34.0  )
Chandrayaan-3 : విక్రమ్, ప్రజ్ఞాన్‌ పునరుద్ధణ ప్రక్రియ వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్‌లను పునరుద్ధణ ప్రక్రియను శనివారానికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ దేశాయ్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 22 సాయంత్రం ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్‌ను తిరిగి యాక్టివేట్ చేయాలని అనుకున్నామని తెలిపారు. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల సెప్టెంబర్ 23న వాటిని రీ యాక్టివేట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం 'శివశక్తి పాయింట్'గా పిలవబడే ప్రదేశంలో ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ సెప్టెంబర్ 23న తిరిగి రీ యాక్టివేట్ కానున్నాయి. ప్రస్తుతం రోవర్, ల్యాండర్‌లను స్లీప్ మోడ్‌లో ఉంచారు. చంద్రుడి ఉపరితలంపై ప్రయోగాలు విజయవంతంగా నిర్వహించి రోవర్‌ను సెప్టెంబర్ 2న, ల్యాండర్ ను సెప్టెంబర్ 4న స్లీప్ మోడ్ లోకి తీసుకెళ్లారు.

Advertisement

Next Story

Most Viewed