- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chandrayaan-3: చివరి దశలో చంద్రయాన్-3 మిషన్..
న్యూఢిల్లీ: భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 చంద్రుని ఉపరితలంపై పరిశోధనలో పురోగతిని కొనసాగిస్తోంది. జూలై 14వ తేదీన ప్రయోగించిన ఈ మిషన్‌ను చంద్రుని దక్షిణ ధ్రువంపై ఈ నెల 23వ తేదీన సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం ద్వారా ఇస్రో ఇప్పటికే చారిత్రాత్మక ఫీట్‌ను సాధించింది. చంద్రుని ఉపరితలంపై ఒక వారం పాటు ప్రయాణించిన ప్రజ్ఞాన్ రోవర్ మరో వారం రోజులు ప్రయాణిస్తుంది. చంద్రునిపై ఒక రోజు భూమిపై 14 రోజులకు సమానం. సౌరశక్తితో పని చేసే ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహిస్తున్నాయి. విక్రమ్ ల్యాండర్ నుంచి రోల్ అవుట్ అయినప్పటి నుంచి ప్రజ్ఞాన్ రోవర్ సుమారు 8 మీటర్లు ప్రయాణించింది.
ప్రజ్ఞాన్ రోవర్ అడుగు పెట్టిన ‘శివశక్తి’ ల్యాండింగ్ సైట్ పరిసర ప్రాంతాల్లో చంద్రుని ధూళి, కంకర యొక్క రసాయన కూర్పును అధ్యయనం చేస్తోంది. చంద్రుని భూగర్భ శాస్త్రం, వాతావరణం గురించి అమూల్యమైన డేటాను అందిస్తోంది. విక్రమ్ ల్యాండర్ కలిగి ఉన్న నాలుగు సైంటిఫిక్ పేలోడ్‌లు చంద్ర భూకంపాలు, చంద్రుని ఉపరితలం యొక్క ఉష్ణ లక్షణాలు, ఉపరితలం వద్ద ప్లాస్మాలో మార్పులు, భూమి, చంద్రుని మధ్య దూరాన్ని కొలవడం వంటి పనులు చేస్తుంది. థర్మల్ ప్రోబ్ సాయంతో చంద్ర మట్టిని లోతుగా పరిశోధిస్తుంది. దాని ఉష్ణోగ్రతను కొలుస్తుంది. గత వారం డేటాను సేకరించడం ప్రారంభించిన థర్మల్ ప్రోబ్.. మట్టి, ఉపరితలం మధ్య ఉష్ణోగ్రత వైవిధ్యాన్ని పరిశోధించింది.
చంద్రునిపై రాత్రి వేళ ప్రత్యేక సవాల్..
ఈ మిషన్ చంద్రుడిపై రాత్రి వేళలో ఒక ప్రత్యేకమైన సవాలును ఎదుర్కోనుంది. ధ్రువ ఉష్ణోగ్రతలు మైనస్ 230 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయినప్పుడు ఆ చలిని తట్టుకునేలా ల్యాండర్ లేదా రోవర్‌ను రూపొందించలేదు. దీంతో చంద్రుడిపై సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ రెండూ అజ్ఞాతంలోకి వెళ్తాయి. ఏదేమైనా చంద్రుని అన్వేషణలో చంద్రయాన్-3 మిషన్ ఇప్పటికే గణనీయమైన కృషి చేసింది. అంతరిక్ష శక్తిగా భారత్ ఆవిర్భవించడమే కాదు.. గతంలో ఎవరూ అన్వేషించని చంద్రుని దక్షిణ ధ్రువాన్ని అర్ధం చేసుకునేందుకు కొత్త మార్గాలను తెరిచింది. మిషన్ చివరి వారంలోకి ప్రవేశిస్తున్నందున ప్రజ్ఞాన్, విక్రమ్‌లు వెలికి తీసే డేటా సంపద కోసం ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
- Tags
- Chandrayaan-3