Chandrayaan 3 Live Updates : మరో ముందడుగు.. చంద్రునికి అత్యంత దగ్గరగా వెళ్లిన అంతరిక్ష నౌక

by Mahesh |   ( Updated:2023-08-14 09:39:05.0  )
Chandrayaan 3 Live Updates :  మరో ముందడుగు.. చంద్రునికి అత్యంత దగ్గరగా వెళ్లిన అంతరిక్ష నౌక
X

దిశ, వెబ్‌డెస్క్: జూలై 14న ప్రయోగించిన ఆకాశంలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 మరో ముందడుగు వేసిందని.. ప్రస్తుతం అంతరిక్షంలోకి వెళ్లిన నౌక చంద్రుని చుట్టూ తిరుగుతూ.. మరో కక్షలోకి ప్రవేశించింది. కాగా ఇది చంద్రునికి అత్యంత దగ్గరగా ఉంటుందని.. బెంగళూరు ప్రధాన కార్యాలయమైన అంతరిక్ష సంస్థ తెలిపింది. ISRO ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ఆగస్టు 5న చంద్ర కక్ష్యలోకి ప్రవేశించింది, ఆ తర్వాత ఆగస్టు 6, 9 తేదీల్లో అంతరిక్ష నౌకలో రెండు కక్షలను పూర్తి చేసింది. కాగా ప్రస్తుతం మరో కక్షను పూర్తి చేసుకుని చంద్రుని అత్యంత దగ్గరగా ఉండే కక్షలోకి ప్రవేశించింది.

కాగా చంద్రయాన్-3 తదుపరి ఆపరేషన్ ఆగస్టు 16, 2023, దాదాపు 0830 గంటలకు షేడ్యూల్ చేశారు. మిషన్ పురోగమిస్తున్న కొద్దీ, చంద్రయాన్-3 యొక్క కక్ష్యను క్రమంగా తగ్గించడానికి, చంద్ర ధృవాలపై ఉంచడానికి ఇస్రో వరుస విన్యాసాలు నిర్వహిస్తోంది. కాగా ISRO మూలాల ప్రకారం, ఆగస్టు 16 న అంతరిక్ష నౌక 100 కి.మీ కక్ష్యకు చేరుకోవడానికి మరో యుక్తిని నిర్వహిస్తారు. ఆ తర్వాత దాని ల్యాండర్ రోవర్‌లతో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోనుంది. కాగా ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో మృదువైన ల్యాండింగ్ చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed