Chandrayaan-3: స్లీప్‌ మోడ్‌లోకి ల్యాండర్ ‘విక్రమ్’.. తిరిగి ఎప్పుడు తన పనిని మొదలుపెడుతుందంటే..?

by Vinod kumar |   ( Updated:2023-09-06 06:06:37.0  )
Chandrayaan-3: స్లీప్‌ మోడ్‌లోకి ల్యాండర్ ‘విక్రమ్’.. తిరిగి ఎప్పుడు తన పనిని మొదలుపెడుతుందంటే..?
X

బెంగళూరు : మూడు రోజుల క్రితమే చంద్రయాన్-3 మిషన్ లోని రోవర్ ‘ప్రజ్ఞాన్’ స్లీప్ మోడ్‌లోకి వెళ్లగా.. ఇప్పుడు ల్యాండర్ ‘విక్రమ్’ కూడా స్లీప్ మోడ్‌లోకి వెళ్లింది. సోమవారం రాత్రి 8 గంటలకు విక్రమ్ స్లీప్ మోడ్ లోకి వెళ్లిందని పేర్కొంటూ ఇస్రో ట్వీట్ చేసింది. స్లీప్ మోడ్‌లోకి వెళ్లేందుకు టైం సెట్ చేయడానికి ముందు వరకు కూడా హాప్ ప్రయోగంలో ల్యాండర్ యాక్టివ్‌గా పాల్గొందని తెలిపింది. దానిలోని రాంభా, చాస్టే, ఐఎల్ఎస్ఏ పేలోడ్లు బాగానే పనిచేస్తున్నాయని వెల్లడించింది.

అయినా రెండువారాల నిర్దేశిత గడువు ముగియడంతో ల్యాండర్ ను స్లీప్ మోడ్ లోకి పంపామని ఇస్రో చెప్పింది. ల్యాండర్ లోని పేలోడ్లు అన్నీ స్విచ్ ఆఫ్ అయ్యాయని, రిసీవర్లు మాత్రం ఆన్ లోనే ఉన్నాయని వివరించింది. సోలార్ పవర్ తగ్గి బ్యాటరీ ఖాళీ అయిన తర్వాత ప్రజ్ఞాన్ పక్కనే విక్రమ్ కూడా స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోతుందని తెలిపింది. చంద్రుడిపై మళ్లీ సెప్టెంబర్ 22న సూర్యుడు ఉదయిస్తాడని, ఆ రోజే విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తిరిగి మేల్కొంటాయని ఆశిస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది.

Advertisement

Next Story