- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chandrachud: చట్టాలను పరిశీలించడమే మా విధి.. ప్రతిపక్ష పాత్ర మాది కాదు: మాజీ సీజేఐ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: చట్టాలను పరిశీలించమే తమ విధి అని.. ప్రతిపక్ష పాత్రను పోషించడం తమ పని కాదని సుప్రీం కోర్టు (Supreme Court) మాజీ చీఫ్ జస్టీస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. తాజాగా, లోక్‌సభ పక్ష నేత వ్యాఖ్యలపై స్పందించడం తనకు ఇష్టం లేదని అన్నారు. పార్లమెంట్ (Parliament), శాసనసభల్లో న్యాయ వ్యవస్థ ప్రతిపక్ష పాత్రను పోషిస్తుందని ప్రజలు అనుకోవడం పొరపాటని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షానికి ప్రత్యేక స్థానం ఉందని చంద్రచూడ్ అన్నారు.
కాగా, ఇటీవల రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఓ మీటింగ్‌లో మీడియా, దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థల తరపున కూడా తాము ఒంటరిగానే పని చేస్తున్నామని, భారతదేశ వాస్తవికత ఇదేనంటూ కామెంట్ చేశారు. తాజాగా, ఆయన వ్యాఖ్యలపై స్పందించిన డీవై చంద్రచూడ్ (DY Chandrachud) తనదైన స్టైల్లో జవాబునిచ్చారు.