- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Champai Soren : చంపై సోరెన్‌పై జార్ఖండ్ సీఎం స్పైయింగ్ : హిమంత బిస్వశర్మ
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ బీజేపీలో చేరిన వేళ అసోం సీఎం హిమంత బిస్వశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. చంపై సోరెన్ కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నిఘా పెట్టించారని ఆయన ఆరోపించారు.
దేశంలోని ఏ రాష్ట్ర సీఎం కూడా సొంత ప్రభుత్వంలోని మంత్రిపై ఈవిధంగా నిఘా పెట్టించి ఉండరని వ్యాఖ్యానించారు. ‘‘చంపై సోరెన్‌పై నిఘా పెట్టిన ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో నాలుక కరుచుకున్న హేమంత్ సోరెన్, ఆ ఇద్దరు వ్యక్తులను చంపై సోరెన్‌కు భద్రత కల్పించేందుకు పంపామన్నారు. ఒకవేళ అదే నిజమైతే ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గర ఆయుధాలు ఎందుకు లేవు ?’’ అని హిమంత బిస్వశర్మ ప్రశ్నించారు.
Advertisement
Next Story