Shock punishment : ఉద్యోగులకు సీఈవో షాక్ పనిష్మెంట్

by Y. Venkata Narasimha Reddy |
Shock punishment : ఉద్యోగులకు సీఈవో షాక్ పనిష్మెంట్
X

దిశ, వెబ్ డెస్క్ : కార్యాలయానికి పనిపై వచ్చిన వృద్ధుడిని నిలబెట్టిన ఉద్యోగులకు సీఈవో ఊహించని పనిష్మెంట్ తో గుణపాఠం నేర్పించిన ఘటన వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్ నోయిడా(Uttar Pradesh Noida)లో న్యూ ఓక్లా ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కార్యాలయానికి ఓ వృద్ధుడు పనిమీద వచ్చి లైన్ లో నిలుచున్నాడు. అది గమనించిన సీఈవో లోకేష్ ఆయన పనిని చూడాలంటూ ఒక మహిళా ఉద్యోగికి చెప్పాడు. విధి నిర్వాహణలో నిర్లక్ష్యం అలవాటుగా మార్చుకున్న ఉద్యోగులు ఆ వృద్ధుడి(Old man)ని 20 నిమిషాల పాటు నిలబెట్టారు(kept standing). అతడికి కావాల్సిన పని చేయడంలో జాప్యం చేయడంతో పాటు కనీసం వృద్ధుడని కూడా చూడకుండా కూర్చోబెట్టకుండా అంతసేపు నిలబెట్టారు. ఈ విషయం తెలుసుకున్న నోయిడా అథారిటీ సీఈఓ డాక్టర్ లోకేష్ వృద్ధుడి పట్ల కార్యాలయ ఉద్యోగులు అనుసరించిన వైఖరిపై మండిపడ్డారు.

ఉద్యోగులకు తగిన గుణపాఠం చెప్పాలనుకున్న సీఈవో లోకేష్ ఆ వృద్ధుడిని నిలుచోబెట్టినందుకు పనిష్మెంట్ గా ఉద్యోగులందరినీ కూడా 20 నిమిషాల పాటు నిలబడి పనిచేసేలా ఆదేశించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ గా మారింది. సీఈవో లోకేష్ నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఉన్నతాధికారులంగా ఇలాగే ఉంటే ప్రభుత్వ కార్యాలయాల పనితీరు మెరుగుపడుతుందంటున్నారు. 2005 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ లోకేశ్‌ గతేడాది నుంచి నోయిడా అధారిటీకి సీఈవోగా ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed