census: వచ్చే ఏడాది జనగణన చేపట్టే యోచనలో కేంద్రం

by Shamantha N |   ( Updated:2024-10-28 06:51:19.0  )
census: వచ్చే ఏడాది జనగణన చేపట్టే యోచనలో కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: జనగణనకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. వచ్చే ఏడాది నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని.. 2026 వరకు కొనసాగవచ్చని తెలుస్తోంది. ఆ తర్వాతే లోక్‌సభ స్థానాల విభజన (delimitation of Lok Sabha seats) ప్రక్రియ ప్రారంభమవుతుందని, అది 2028కి ముగుస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రాలవారీగా, జాతీయస్థాయిలో రకరకాల అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు రూపొందించి అమలుపరచడానికి ఈ జనగణన కీలకంగా మారింది. ప్రతి పదేళ్ల కొకసారి జనగణన నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, అది ప్రతిసారి వాయిదా పడుతోంది. కొవిడ్‌ సంక్షోభం తర్వాత నుంచే జనగణన ప్రక్రియ చేపట్టాలని ప్రతిపాదనలు వస్తున్నా.. ప్రతిసారీ వాయిదా పడుతోంది.

గతంలో అమిత్ షా ఏమన్నారంటే?

Centre to begin census from 2025, Lok Sabha seats delimitation by 2028: Sourcesఇకపోతే, దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గతంలో కులగణన గురించి మాట్లాడారు. తగిన సమయంలో సెన్సస్ను నిర్వహిస్తామన్నారు. అయితే, దానిపై నిర్ణయం తీసుకున్న తర్వాతే ఏ విధంగా నిర్వహిస్తామో చెప్తామన్నారు. అయితే, ఈసారి మాత్రం పూర్తిగా డిజిటల్ సర్వే ఉంటుందన్నరు. ఇకపోతే, గతేడాది ఏప్రిల్‌లో చైనాను అధిగమించి అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించినట్లు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ప్రస్తుతం చైనా జనాభా 142 కోట్ల కన్నా భారతీయ జనాభా రెండు కోట్లు అధికమన్నది ఒక అంచనాయే తప్ప.. కచ్చితమైన లెక్కలు లేవు. ఇక, 2011 నాటి గణాంకాల ఆధారంగానే లక్ష్యాలు, వ్యయ అంచనాలు రూపొందిస్తున్నారు. దీనిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో కులగణన గురించి వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై ప్రభుత్వం మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Advertisement

Next Story

Most Viewed