- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Work Stress : పని ఒత్తిడితో యువ సీఏ సూసైడ్.. కేంద్రం విచారణ
దిశ, నేషనల్ బ్యూరో : పనిభారాన్ని తట్టుకోలేక 26 ఏళ్ల యువ ఛార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) అన్నా సెబాస్టియన్ పెరయిల్ ఇటీవలే ఆత్మహత్య చేసుకుంది. దీనిపై అన్నా సెబాస్టియన్ తల్లి అనితా ఆగస్టైన్ సదరు కంపెనీ బాస్‌కు రాసిన బాధాతప్త ఈమెయిల్ వైరల్ అయింది. ఈ అంశంపై కేంద్ర కార్మిక శాఖ స్పందించింది. అన్నా సెబాస్టియన్ తల్లి నుంచి తమకు ఫిర్యాదు అందిందని వెల్లడించింది. అన్నా సెబాస్టియన్ ఎందుకు సూసైడ్ చేసుకుంది ? అసలు కారణం ఏమిటి ? అనేది తేల్చే దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు కార్మిక శాఖ తెలిపింది.
ఈమేరకు వివరాలతో కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ ఈ అంశంపై ఎక్స్‌లో చేసిన ఒక పోస్టుకు స్పందిస్తూ కేంద్ర మంత్రి పై ప్రకటన చేశారు. రాజీవ్ చంద్రశేఖర్ కేరళలోని తిరువనంతపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అన్నా సెబాస్టియన్ కూడా కేరళ వాస్తవ్యురాలే. అయితే ఆమె ఓ ప్రముఖ ఆర్థిక సేవల కంపెనీకి చెందిన పుణె బ్రాంచ్‌లో పనిచేసేది.