VIPs security: దేశవ్యాప్తంగా ఉన్న 9 మంది వీఐపీలకు ఎన్ ఎస్ జీ సెక్యూరిటీ తొలగింపు

by Shamantha N |   ( Updated:2024-10-16 11:50:00.0  )
VIPs security: దేశవ్యాప్తంగా ఉన్న 9 మంది వీఐపీలకు ఎన్ ఎస్ జీ సెక్యూరిటీ తొలగింపు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఉన్న 9 మంది వీఐపీలకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(NSG) కమాండోలను విత్ డ్రా చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఎన్ఎస్ జీ కమాండోల స్థానంలో సీఆర్‌పీఎఫ్ కమాండోలకు బాధ్యతలు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బందితో కూడిన బెటాలియన్‌ను కూడా మంజూరు చేసింది. అయితే, ఇటీవలే పార్లమెంట్ సెక్యూరిటీ విధుల నుంచి వైదొలగిన సీఆర్‌పీఎఫ్-వీఐపీ సెక్యూరిటీ వింగ్‌ని ప్రముఖుల భద్రత కోసం వినియోగించనున్నారు. ప్రస్తుతం దేశంలో ఎన్ఎస్‌జీ ‘బ్లాక్ క్యాట్’ కమాండోల భద్రతలో 9 మంది వీఐపీలు ఉన్నారు. వీరందరికి కూడా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్)తో భద్రత కల్పిస్తారు. ‘‘జెడ్ ప్లస్’’ కేటగిరీలో ఉన్నవారిలో ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయవతి, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీనియర్ బీజేపీ నేత ఎల్‌కే అద్వానీ, కేంద్ర షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్ ఉన్నారు. జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్, ఎన్సీ నేత ఫరూఖ్ అబ్దుల్లా వంటి ప్రముఖులు కూడా ఈ సెక్యూరిటీ కవరేజీలో ఉన్నారు.

ఇద్దరికి ఏఎస్ఎల్ ప్రోటోకాల్

కాగా.. తొమ్మిది మంది వీఐపీల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సీఆర్‌పీఎఫ్ చేపడుతున్న ఏఎస్ఎల్ ప్రోటోకాల్‌ని కలిగి ఉంటారని తెలుస్తోంది. ఏఎస్ఎల్ ప్రోటోకాల్ ప్రకారం.. వీఐపీలు సందర్శించాల్సిన ప్రదేశం మొత్తం భద్రతా అధికారుల నిఘాలోకి వెళ్లిపోతుంది. ఇలాంటి ప్రోటోకాల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, గాంధీ కుటుంబంలోని ముగ్గురితో సహా ఐదుగురికి ఉంది. యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ నిర్వహిచే ఎన్ఎస్‌జీ కమాండోలను ఇకపై పూర్తిగా టెర్రర్ ఆపరేషన్లపై దృష్టిసారించేలా చేయడం కేంద్రం ఈ ప్లాన్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. వీఐపీ భద్రతా నుంచి ఎన్ఎస్‌జీని విత్ డ్రా చేసిన తర్వాత 450 మంది భద్రతా బాధ్యతల నుంచి రిలీవ్ అవుతారు.

Advertisement

Next Story

Most Viewed