- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డులను 'డీయాక్టివేట్' చేస్తోంది: దీదీ
దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని ప్రజల ఆధార్ కార్డును 'డీయాక్టివేట్' చేసిందని విరుచుకుపడ్డారు. తద్వారా తమ ప్రభుత్వం అందించే వివిధ సామాజిక సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజలకు చేరకుండా చేశారని విమర్శించారు. ఆదివారం బీర్‌భూమ్ జిల్లాలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడిన మమతా, ఆధార్ కార్డు లేకపోయినా సరే లబ్దిదారులకు తమ ప్రభుత్వం వివిధ పథకాలకు చెందిన ప్రయోజనాలను అందిస్తూనే ఉంటుందని చెప్పారు. 'ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేస్తోంది. ప్రభుత్వ పథకాలతో డీలింక్ చేయడం వల్ల లబ్దిదారులకు సంక్షేమ ప్రయోజనాలు దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, తాము ప్రతి ఒక్కరికీ పథకాలకు సంబంధించి ఫలాలను అందిస్తాం. ఆధార్ కార్డు లేకపోయినా లబ్ధిదారులకు చెల్లిస్తూనే ఉంటాం. ఒక్క లబ్ధిదారుడిపైనా ప్రభావం ఉండదని' దీదీ పేర్కొన్నారు. ఇక, కనీస మద్దతు ధరపై ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హర్యానా, పంజాబ్‌లలో రైతులు చేస్తున్న ఆందోళనను ప్రస్తావించిన మమతా, రైతులకు ఎలాంటి సమస్యలు లేవన్నారు. రైతుల నిరసనకు సెల్యూట్ చేస్తున్నాను. వారిపై దాడులను ఖండిస్తున్నానని వెల్లడించారు.