- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆపరేషన్ గంగా: ఒక్కరోజులో 3726 మంది ఇండియాకు
దిశ, డైనమిక్ బ్యూరో: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. యుద్ధం కారణంగా విమానయానం మరింత ప్రమాదకరంగా ఉండటంతో.. ఖార్కీవ్‌లోని భారతీయులంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు కేంద్రం రష్యా సహకారం తీసుకుంటోంది. అయితే, ఉక్రెయిన్ల నుంచి వస్తున్న వ్యతిరేకతతో రైళ్లు ఇతర వాహనాలలో భారతీయులకు అనుమతించకపోవడంతో కాలినడకన సరిహద్దు ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఎంబసీ సూచించింది. ఈ క్రమంలో భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన 'ఆపరేషన్ గంగా'లో భాగంగా గురువారం ఏకంగా 3726 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్లు కేంద్ర పౌర విమానాయాన మంత్రి జ్యోతిరాదిత్య సిందియా పేర్కొన్నారు. బుకారెస్ట్ నుంచి 8, సుసెవా నుంచి 2, కోసిన్ నుంచి 1, బుడాపెస్ట్ నుంచి 5, రెస్జో నుంచి 3 విమానాల ద్వారా వీరిని తరలించినట్లు వెల్లడించారు. ఉక్రెయిన్ నుంచి ప్రతి ఒక్కరినీ సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.