త్రిపుర తీవ్రవాద సంస్థలతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం

by M.Rajitha |
త్రిపుర తీవ్రవాద సంస్థలతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం
X

దిశ, వెబ్ డెస్క్ : బుధవారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి, త్రిపుర(Tripura)కు చెందిన తీవ్రవాద సంస్థలకు శాంతి ఒప్పందం జరిగింది. త్రిపురకు చెందిన నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (NLFT), ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ (ATTF) సంస్థల ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం, త్రిపుర ప్రభుత్వం శాంతి ఒప్పందాలపై సంతకాలు చేశాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amith Sha), త్రిపుర సీఎం మాణిక్ సాహ సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఈ శాంతి ఒప్పందం అనంతరం అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ.. త్రిపురలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని, ఈ ప్రాంత అభివృద్దికి పూర్తి సహాయ సహకారాలు అందించడమే ఈ శాంతి ఒప్పందాల లక్ష్యం అన్నారు. కాగా ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన ఒప్పందాలలో ఇది 12వది కాగా, త్రిపురకు సంబంధించి 3వది అని వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు 10 వేల మండి తిరుగుబాటు దారులు ఆయుధాలు వదిలి, జనజీవన స్రవంతిలో కలిశారని పేర్కొన్నారు. ఈ రోజు జరిగిన ఒప్పందంతో మరింతమంది ఆయుధాలు వదిలేస్తారని అన్నారు. వీరందరి జీవనోపాధి కోసం పథకాలు రూపొందిస్తామని సీఎం మాణిక్ సాహ తెలియ జేశారు.

Next Story

Most Viewed