- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఫోన్ పే, గూగుల్ పే వాడే వారికి షాక్.. కేంద్రం కీలక నిర్ణయం
దిశ, డైనమిక్ బ్యూరో: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం ఛార్జీలు విధించనున్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో యూపీఐ ద్వారా నిర్వహించబడే వ్యాపార లావాదేవీలకు ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ (పీపీఐ) ఛార్జీలు అమలులోకి రాబోతున్నాయనే వార్త బీఆర్ఎస్ సోషల్ మీడియా ఖాతాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
దీని ప్రకారం.. యూపీఐ ద్వారా నిర్వహించే వ్యాపార లావాదేవీలపై 1.1 శాతం చార్జీ వసూలు చేసుకునే వీలుగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ) ఇటీవల విడుదల చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది. ఎన్‌పీసీఐ ఇటీవలి సర్క్యులర్‌లో ఏప్రిల్ 1 నుండి యూపీఐలో రూ.2 వేల కంటే ఎక్కువ మర్చంట్ లావాదేవీలపై 1.1 పీపీఐ ఛార్జీలు వర్తింపజేయాలని సిఫార్సు చేసింది. కాగా ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ సోషల్ మీడీయాలో మోడీ ప్రభుత్వంపై సెటైర్లు వేస్తోంది. ఇది మోడీ ప్రభుత్వం ఇస్తున్న మరో గిఫ్ట్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.