- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీబీ నగర్ ఎయిమ్స్ డెవలప్ చేస్తున్నాం.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రాథమిక, ద్వితీయ ఆరోగ్య సంరక్షణ, టెలి కన్సల్టేషన్ల ద్వారా మారుమూల ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఆరోగ్య సంరక్షణ కోసం ఫీల్డ్ వర్కర్లకు నైపుణ్యాన్ని కల్గిస్తున్నామని స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా ప్రధాన మంత్రి స్వస్త్య సురక్ష యోజన స్కీమ్‌తో వైద్యారోగ్య రంగం ఎంతో బలోపేతం అవుతున్నట్లు పేర్కొన్నది. దేశంలోని వెనుకబడిన ప్రాంతాలలో వైద్య విద్య, పరిశోధన, క్లినికల్ కేర్ రంగాల సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు వెల్లడించింది.
దీనిలో భాగంగానే ఎయిమ్స్ బీబీనగర్‌ను కూడా డెవలప్ చేశామని కేంద్రం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఎయిమ్స్ బీబీనగర్ నిర్మాణానికి భారత ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.1366 కోట్లను రిలీజ్ చేసినట్లు ప్రకటించింది. కాంప్లెక్స్ కోసం రూ. 350 కోట్లు, జీతాలకు రూ. 65 కోట్లు, క్యాపిటల్ హెడ్ కింద రూ. 21.72 కోట్లు, జనరల్ హెడ్ కు రూ.23.50 కోట్లు కేటాయించినట్లు కేంద్రం పేర్కొన్నది.