Kolkata doctor rape-murder: ఆర్జీకర్ హాస్పిటల్ లో సీఐఎస్ఎఫ్ రెక్కీ

by Shamantha N |
Kolkata doctor rape-murder: ఆర్జీకర్ హాస్పిటల్ లో సీఐఎస్ఎఫ్ రెక్కీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతా ట్రైనీ డాక్ట‌ర్‌ హత్యాచార ఘటన దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. కాగా.. ఈ కేసులో భాగంగా కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌ దగ్గర కేంద్ర బలగాలు మోహరించాయి. విమానాశ్రయాలు, పార్లమెంట్‌లకు రక్షణగా ఉండే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అధికారులు ఆర్జీ కర్ హాస్పిటల్ దగ్గర రెక్కీ నిర్వహిస్తున్నారు. కోల్‌కతా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన మరుసటి రోజు ఈ పరిణామం వెలుగుచూసింది. ఆసుపత్రికి చేరుకున్న తర్వార సీనియర్‌ సీఐఎస్‌ఎఫ్‌ అధికారి మీడియాతో మాట్లాడుతూ..ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధులు నిర్వర్తించేందుకు ఆసుపత్రి వద్దకు వచ్చినట్లు తెలిపారు. ప్రత్యేక పని కోసం హాస్పిటల్ కు వచ్చామన్నారు. తమ పని తాము చేస్తామని, మిగతా విషయాలు సీనియర్ అధికారులు తెలియజేస్తారు పేర్కొన్నారు.

ముగ్గురు అధికారులపై వేటు

ఇకపోతే, ఆర్జీ కర్ హాస్పిటల్ లో వారం క్రితం దుండగురు విధ్వంసం సృష్టించారు. విధుల్లో ఉన్న ముగ్గురు పోలీసు అధికారులను కోల్‌కతా పోలీసు విభాగం సస్పెండ్‌ చేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో వారిపై చర్యలు తీసుకుంది. హాస్పిటల్ దగ్గర విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఏసీపీలు, ఒక ఇన్‌స్పెక్టర్‌పైన వేటు వేసింది. మెడికోపై హత్యాచారానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నప్పుడు.. విధ్వంసకారులు కర్రలు, ఇటుకలు, రాడ్లతో ఆసుపత్రి ఆవరణలోకి దూసుకొచ్చి దాడులు చేశారు. దాడికి పాల్పడినవారిలో ఇప్పటివరకూ పలువురిని అరెస్టు చేశారు.

Advertisement

Next Story

Most Viewed