Budget 2023 Live Updates: బడ్జెట్‌లో రైతులకు సూపర్ న్యూస్

by Mahesh |
Budget 2023 Live Updates: బడ్జెట్‌లో రైతులకు సూపర్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర బడ్జెట్‍ 2023-24 ను పార్లమెంట్‌లో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‍ ప్రవేశపెట్టారు. రైతుల అభివృద్దే లక్ష్యంగా ఈ బడ్జెట్‌లో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు రూ. 20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది. అలాగే వ్యవసాయంతో పాటు మత్స్యశాఖ, డెయిరీలను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం పీఎం మత్స్య సంపద యోజన కోసం అదనంగా రూ. 6 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అంతేగాక, రైతుల ఉత్పత్తుల నిల్వల కోసం గిడ్డంగులు నిర్మిస్తామని వెల్లడించింది.

Advertisement

Next Story