సుప్రీం తీర్పును అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర : కేజ్రీవాల్

by Sathputhe Rajesh |
సుప్రీం తీర్పును అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర : కేజ్రీవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై ఫైర్ అయ్యారు. ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై నియంత్రణాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అంటూ గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఆర్డినెన్స్ ద్వారా కేంద్రం అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుందన్నారు. మే 18 నుంచి సుప్రీం కోర్టుకు సెలవులు ఉన్నాయని ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ తీసుకువచ్చిందని కేంద్రం తీరును తప్పుబట్టారు. కేంద్రం నిర్ణయం అప్రజాస్వామికమన్నారు. ఈ అంశంపై మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్నారు.

Advertisement

Next Story