- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jammu Kashmir లో శాంతి భద్రతలను నెలకొల్పడంలో కేంద్రం విఫలం అయింది: రాహుల్ గాంధీ
దిశ, వెబ్ డెస్క్: గురువారం సాయంత్రం.. జమ్మూ కాశ్మీర్(Jammu and Kashmir)లోని గుల్‌మార్గ్‌లో సైనిక వాహనం ఉగ్రవాదులు దాడి (Terrorists Attack) చేయగా.. మొత్తం ఐదుగురు జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ట్విట్టర్ స్పందించారు. రాహుల్ తన ట్వీట్‌లో సైనిక వాహనంపై జరిగిన పిరికిపంద దాడిలో మన వీర జవాన్లు వీరమరణం పొందారనే వార్త చాలా బాధాకరం. ఈ దాడిలో ఇద్దరు కూలీలు కూడా ప్రాణాలు కోల్పోయారు. అమరవీరులకు నివాళులర్పిస్తున్నాను. మృతుల కుటుంబాలందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని రాసుకొచ్చారు.
అలాగే జమ్మూకశ్మీర్(Jammu Kashmir)లో శాంతి భద్రతలను నెలకొల్పడంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ(NDA Govt) విధానాలు పూర్తిగా విఫలమయ్యాయి. వారు చెబుతున్న దానికి విరుద్ధంగా నిరంతర ఉగ్రవాద కార్యకలాపాలు, మన సైనికులపై దాడులు, పౌరులను లక్ష్యంగా చేసుకున్న హత్యల కారణంగా రాష్ట్రం ప్రమాదపు నీడలో జీవిస్తోందన్నది వాస్తవం అని విమర్శించారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే జవాబుదారీతనం వహించాలని.. జమ్మూ కాశ్మీర్ లోయలో వీలైనంత త్వరగా శాంతిని పునరుద్ధరించాలని, సైన్యం, రాష్ట్ర పౌరులకు భద్రత కల్పించాలని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.