'జెలెన్‌స్కీ మొండి వైఖరి వల్లే యుద్ధం'.. రష్యా విదేశాంగ మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Vinod kumar |
జెలెన్‌స్కీ మొండి వైఖరి వల్లే యుద్ధం.. రష్యా విదేశాంగ మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

న్యూఢిల్లీ : భారత్‌లో జీ20 సదస్సుకు హాజరైన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ చేజేతులా తన దేశాన్ని తానే నాశనం చేసుకుందని విమర్శించారు. పశ్చిమ దేశాలకూ ఇప్పటికే ఈ విషయం అర్థమై ఉంటుందని ఆయన సెటైర్లు వేశారు. ‘‘ఉక్రెయిన్‌ అంశంపై పశ్చిమ దేశాలు పూర్తిస్థాయి చర్చ జరిగేందుకు సహకరించడం లేదు. రష్యాపై ఆరోపణలు చేయడం తప్ప అవేమీ చేయడం లేదు. యుద్ధాన్ని ఆపాలని రష్యాను డిమాండ్ చేస్తున్నాయి. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పాలని చెబుతున్నారు. ఇలా ఏకపక్షంగా మాట్లాడమేంటి..? ఐక్యరాజ్యసమితి ఛార్టర్‌లోనూ సమానత్వ సూత్రం ఉందన్న విషయాన్ని వాళ్లు మర్చిపోయారా’’ అని సెర్గీ లవ్రోవ్ పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమే అని గతంలోనే పుతిన్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘ఉక్రెయిన్‌లో శాంతి కోసం 18 నెలల క్రితమే మేం ప్రయత్నాలు చేశాం. డాక్యుమెంట్స్ సిద్ధం చేశాం. కానీ వాటిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంతకం చేయలేదు. ఆయన మొండి వైఖరి, నాటో కూటమి విధానాల వల్లే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి’’ అని ఆయన తెలిపారు. రష్యా పౌరులపై దాడులు చేసేందుకు ఉక్రెయిన్‌ అధికారులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed