- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెంట్రల్ జైల్లో మొబైల్ ఫోన్స్, డ్రగ్స్, డబ్బు.. సీసీబీ సోదాల్లో షాకింగ్ నిజాలు..
దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు పరప్పన అగ్రహారంలోని సెంట్రల్ జైల్లో (Central Jail) తీగ లాగితే డొంక కదులుతోంది. స్టార్ హీరో దర్శన్, రౌడీ షీటర్ నాగ ఆరుబయట కాఫీ తాగుతున్న ఫోటో వైరల్ కావడంతో సెంట్రల్ జైలు అధికారుల తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంతో అప్రమత్తమైన ప్రభుత్వం అనేక మంది పోలీసులపై వేటు వేయడంతో పాటు సెంట్రల్ జైలు పనితీరుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే సోమవారం నాడు సీసీబీ అధికారులు సెంట్రల్ జైల్లో ఆకస్మిక సోదారు నిర్వహించగా ఊహించని విధంగా సెల్‌ఫోన్లు, డ్రగ్స్, డబ్బు అధికారుల చేతికి చిక్కాయి.
కొద్ది రోజుల క్రితం రౌడీషీటర్ విల్సన్ గార్డెన్ నాగ (Wilson Garden Naga) తో కలిసి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ (Darshan) ఆరుబయట తాపీగా టీ, సిగరెట్ తాగుతూ కూర్చున్న ఫోటోలు వైరల్ కావడంతో జైలు అధికారుల పనితీరుపై అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే అప్రమత్తమైన ప్రభుత్వం (Government).. 9 మంది అధికారులపై సస్పెన్షన్ వేటు వేయడమే కాకుండా 30 మందిని బదిలీలు కూడా చేసింది. ఇక తాజాగా సీసీబీ అధికారులు అకస్మాత్తుగా జైల్లో సోదాలు జరిపారు. ఈ సోదాల్లో రౌడీ షీటర్ నాగ, అతడి అనుచరుల నుంచి 18ఫోన్లు, డ్రగ్స్ ప్యాకెట్లు, కొంత డబ్బును స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు సీసీబీ అధికారులు వెల్లడించారు. మరి ఈ సోదాల అనంతరం జైలు అధికారుల (Jail Officials)పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.