CBI raids: జార్ఖండ్‌ సహా మూడు రాష్ట్రాలో సీబీఐ దాడులు.. భారీగా నగదు, కేజీ బంగారం స్వాధీనం

by vinod kumar |
CBI raids: జార్ఖండ్‌ సహా మూడు రాష్ట్రాలో సీబీఐ దాడులు.. భారీగా నగదు, కేజీ బంగారం స్వాధీనం
X

దిశ, నేషనల్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల వేళ జార్ఖండ్‌(Jharkhand)లో సీబీఐ దాడులు కలకలం రేపాయి. రాష్ట్రంలో జరిగిన రూ.1200 కోట్ల అక్రమ మైనింగ్ స్కామ్‌(Illigal mining scam)కు సంబంధించిన కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (Cbi) మంగళవారం దాడులు నిర్వహించింది. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాల్లోని 16 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్, పాకూర్, రాజ్‌మహల్‌ జిల్లాలతో పాటు కోల్‌కతా, పాట్నాల్లో దాడులు చేసింది. ఈ తనిఖీల్లో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి రూ.50 లక్షల నగదు, ఒక కేజీ బంగారం(Gold), కిలో వెండి, పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధమున్న అనుమానితులు, వారి సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు జరిగినట్టు తెలుస్తోంది.

జార్ఖండ్‌లో ప్రసిద్ధి చెందిన నింబు పహాడ్(Nimboo pahad) ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరిగినట్టు ఆరోపణలున్నాయి. ఇక్కడ ఉన్న విలువైన రాళ్లను అనుమతి లేకుండా వెలికితీసి అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జార్ఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు 2023 నవంబర్ 23న సీబీఐ కేసు నమోదు చేసింది. సీఎం హేమంత్‌ సోరెన్‌కు సన్నిహితుడైన పంకజ్‌ మిశ్రా(Pankaj mishra)ను నిందితుడిగా చేర్చింది. ఈ కేసును సీబీఐతో పాటు ఈడీ కూడా విచారిస్తోంది. పంకజ్ మిశ్రా విచారించిన ఈడీ గతంలోనే ఆయనను అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే మరోసారి దాడులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Next Story