ఆ ఒత్తిడికి CBI అధికారి ఆత్మహత్య.. కీలక వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం ..

by Hajipasha |   ( Updated:2022-09-05 10:56:15.0  )
ఆ ఒత్తిడికి CBI అధికారి ఆత్మహత్య.. కీలక వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం ..
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అమలులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే తనపై తప్పుడు కేసులు సృష్టిస్తున్నారని కేంద్రంపై సంచలన కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే మరోసారి స్పందించిన మనీష్ సిసోడియా.. 'నన్ను తప్పుడు కేసులో ఇరికించాలని సీబీఐ అధికారిపై ఒత్తిడి చేశారు. మానసిక ఒత్తిడి తట్టుకోలేక రెండు రోజుల క్రితం సీబీఐ అధికారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు'. అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది నిజంగా దురదృష్టకరమని అన్నారు. అధికారులపై మోడీ ఎందుకు ఒత్తిడి తెస్తున్నారని నిలదీశారు. ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తే.. నన్ను అరెస్ట్ చేయండి. కానీ, అధికారుల కుటుంబాలను నాశనం చేయవద్దని వ్యాఖ్యనించారు.

Advertisement

Next Story