Kolkata: కోల్‌కతా హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టుకు రిపోర్ట్‌ను సమర్పించిన సీబీఐ

by Harish |
Kolkata: కోల్‌కతా హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టుకు రిపోర్ట్‌ను సమర్పించిన సీబీఐ
X

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు సంబంధించిన ఘటనపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ తన స్టేటస్ రిపోర్ట్‌ను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఆగస్టు 20న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు నివేదికను గురువారం సీల్డ్ కవర్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ముందు దాఖలు చేసింది. ఇదే కేసులో బెంగాల్ ప్రభుత్వం కూడా దర్యాప్తు రిపోర్టు న్యాయస్థానానికి సమర్పించినట్లు సమాచారం.

విచారణలో భాగంగా బెంగాల్ ప్రభుత్వానికి 21 మంది న్యాయవాదుల బృందం ప్రాతినిధ్యం వహిస్తుంది, కేంద్ర ప్రభుత్వం తరఫున ఐదుగురు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తారు. ఇదిలా ఉంటే మంగళవారం నాటి విచారణలో, కేసు నిర్వహణలో లోపాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో విధ్వంసాన్ని ఆపడంలో విఫలమైనందుకు బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. ఎఫ్‌ఐఆర్ నమోదులో ఆలస్యం చేసినందుకు ఆసుపత్రి అధికారుల తీరుపై మండిపడింది. బాధితురాలి పేరు, ఫొటోలు మీడియాలో ప్రసారం కావడంపై చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed