సిసోడియాకు నేడు బెయిలా.. జైలా.. కోర్టు నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ..!

by Satheesh |   ( Updated:2023-03-04 06:47:54.0  )
సిసోడియాకు నేడు బెయిలా.. జైలా.. కోర్టు నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజు రోజుకు ఉత్కంఠ పెంచుతోంది. ఈ కేసులో నేడు సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సీబీఐ కస్టడీ నేటితో ముగియనుంది. ఫిబ్రవరి 26న సిసోడియాను అరెస్ట్ చేసిన సీబీఐ అనంతరం కోర్టులో హాజరుపరిచి కస్టడీకి అనుమతి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకున్న అనంతరం ఐదు రోజుల పాటు విచారించి పలు కీలక అంశాలపై ఆరా తీశారు. ఇవాళ్టితో సిసోడియా కస్టడీ ముగియడంతో ఆయనను అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు.

ఈ సందర్భంగా మరికొన్ని రోజులు కస్టడీ కోరే అవకాశం ఉంది. గత ఐదు రోజుల విచారణలో ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందింది. కస్టడీ ఎందుకు కొనసాగించాలో కోర్టుకు వివరించనున్నట్లు సీబీఐ కేంద్ర కార్యాలయం పేర్కొంది. ఇదే కేసులో మాగుంట రాఘవ, రాజేష్ జోషిల జ్యుడీషియల్ రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. మరికొంత కాలం జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు కోరే అవకాశం ఉంది. ఇక బెయిల్ కోసం మనీష్ సిసోడియా, రాజేష్ జోషి ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టును ఇప్పటికే ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఇవాళ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story

Most Viewed