పదేళ్ల తర్వాత లోక్ సభలో ప్రతిపక్ష నేత.. ఏ అధికారాలు ఉన్నాయంటే?

by Shamantha N |   ( Updated:2024-06-26 09:36:49.0  )
పదేళ్ల తర్వాత లోక్ సభలో ప్రతిపక్ష నేత.. ఏ అధికారాలు ఉన్నాయంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారిగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత వచ్చారు. రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. లోక్ సభలోని మొత్తం 10 శాతం సీట్లు గెలిచిన పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కుతుంది. అయితే, ఈసారి 99 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్.. ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. ప్రతిపక్ష నేత సభలో ఎడమ వైపు ముందు వరుసలో కూర్చుంటారు. గాంధీ కుటుంబంలో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల తర్వాత ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నికయ్యారు.

ప్రతిపక్ష నేతకు ఉండే అధికారాలు ఏంటంటే?

రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నాయకుడిగా క్యాబినెట్ మంత్రి హోదా, జీతం, అలవెన్స్ లభిస్తాయి. జీతం రూ. 3.3 లక్షలు లభిస్తుంది. కేబినెట్ మంత్రికి ఉండే భద్రత కల్పిస్తారు. ఇందులో Z+ సెక్యూరిటీ కూడా ఉంటుంది. కేబినెట్ మంత్రి తరహా ప్రభుత్వ బంగ్లా ఉంటుంది. ప్రధాన ఎన్నిక కమిషనర్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించే త్రి సభ్య ప్యానెల్‌లో రాహుల్ గాంధీ ఇప్పుడు మూడో సభ్యుడిగా ఉంటారు. సీబీఐ, ఈడీ, సీవీసీ వంటి కేంద్ర సంస్థల చీఫ్‌లను ఎంపిక చేసే కమిటీలో సభ్యుడిగా రాహుల్ గాంధీకి ఎక్కువ అధికారాలు ఉంటాయి. త్రి సభ్య కమిటీని ప్రధాని నరేంద్రమోడీ లీడ్ చేస్తారు. భారత ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉంటారు. వీరిని ప్రధాని సిఫారసు చేస్తారు.

Advertisement

Next Story