- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైల్వే ట్రాక్‌పై పశువుల పుర్రె, బండరాళ్లు: తమిళనాడులో తప్పిన రైలు ప్రమాదం
దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులో రైలు ప్రమాదం తప్పింది. కన్యాకుమారి జిల్లాలో రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తులు పశువుల పుర్రె, బండరాళ్లను ఉంచారు. ఈ క్రమంలో ప్యాసింజర్ రైలు ఆపరేటర్ వాటిని గమనించి అధికారులకు సమాచారం అందించారు. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో గాంధీధామ్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ త్రివేండ్రం, నాగర్‌కోయిల్ మధ్య ట్రాక్ దాటుతుండగా ఈ ఘటన జరిగింది. వాటిని గమనించిన లోకో పైలట్ వేగం తగ్గించి రైలును నిలిపివేశాడు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ట్రాక్ పై ఎముకలు, పశువుల పుర్రె, బండరాళ్లను గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన కన్యాకుమారీ పోలీసులు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అనే విషయంలో దర్యాప్తు చేపట్టారు. సమీప గ్రామాల్లోని సీసీ కెమెరాల ద్వారా వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ ప్రమాదం తప్పడంతో రైలు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. నిందితులను పట్టుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.