బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై కేసు నమోదు

by S Gopi |
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై కేసు నమోదు
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై సోషల్ మీడియాలో ద్వేషపూరిత పోస్ట్ చేశారనే ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు శుక్రవారం తెలిపారు. బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు, బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య సామాజిక మాధ్యమంలో విద్వేషపూరిత పోస్టులు చేస్తున్నారని, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని శతృత్వాన్ని పెంచేలా వ్యవహరిస్తున్నట్టు బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నట్టు ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ నెల 19న ఎక్స్‌తో పాటు యూట్యూబ్‌లలో ఇటువంటి పోస్టులు చేసినట్టు తెలుస్తోంది. అతనికి ఆయా సోషల్ మీడియాల్లో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసేల వ్యాఖ్యలు ఉండటం, వర్గాల మధ్య మత సామరస్యాన్ని భంగం కలిగిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. బీబీఎంపీ అధికారుల ఫిర్యాదు మేరకు హలసూరు గేట్ పోలీస్ స్టేషన్‌లో మార్చి 20న ఎంపీ తేజస్వి సూర్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. వర్గాల మధ్య శతృత్వాన్ని పెంచడం, మత విశ్వాసాలను అవమానించడం, ఉద్దేశపూర్వకంగా హానీ చేసే చర్యలకు పాల్పడిన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story