Kerala: ఘోర రోడ్డుప్రమాదం.. ఎంబీబీఎస్ స్టూడెంట్స్ దుర్మరణం

by Rani Yarlagadda |
Kerala: ఘోర రోడ్డుప్రమాదం.. ఎంబీబీఎస్ స్టూడెంట్స్ దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: కేరళ (Kerala)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. అలెప్పి వద్ద వేగంగా వచ్చిన కారు బస్సును ఢీ కొట్టడంతో ఐదుగురు మరణించారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు, క్షతగాత్రులంతా ఎంబీబీఎస్ ఫస్టియర్ స్టూడెంట్స్ గా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. భారీ వర్షంలో వేగంగా వచ్చిన కారు.. కాలర్ కోడ్ (Kalarcode) వద్ద బస్సును ఢీ కొట్టింది. కారు మొత్తం నుజ్జునుజ్జవ్వగా.. స్టూడెంట్స్ అంతా లోపలే ఇరుక్కుపోయారు. రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది.. మెటల్ ను కట్ చేసి.. మృతులు, క్షతగాత్రుల్ని బయటికి తీశారు. తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్పగాయాలవ్వగా.. వారికి చికిత్స అందించారు. ప్రమాదంలో మరణించిన ఎంబీబీఎస్ స్టూడెంట్స్ దేవనందన్, లక్షద్వీప్ కు చెందిన మొహమ్మద్ ఇబ్రహీం, ఆయుష్ షాజి, శ్రీదీప్ వాల్సన్, మొహమ్మద్ జబ్బర్ గా గుర్తించారు. వీరంతా టీడీ మెడికల్ కాలేజీ (TD Medical College)లో మెడిసిన్ ఫస్టియర్ చదువుతున్నారని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed