Supreme Court: కర్ణాటక హైకోర్టు జడ్జిపై సుమోటో కేసు ప్రోసీడింగ్స్ నిలిపివేత

by Shamantha N |   ( Updated:2024-09-25 07:41:41.0  )
Supreme Court: కర్ణాటక హైకోర్టు జడ్జిపై సుమోటో కేసు ప్రోసీడింగ్స్ నిలిపివేత
X

దిశ, నేషనల్ బ్యూరో: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక హైకోర్డు జడ్జి వేదవ్యాసాచార్ శ్రీశానందపై ప్రోసీడింగ్స్ ని ముగిస్తున్నట్లు సుప్రీంకోర్టు (Supreme Court) వెల్లడించింది. ఓ కేసు విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు సంబంధించి సుమోటో కేసులో.. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టింది. జస్టిస్ శ్రీశానంద బహిరంగ క్షమాపణ చెప్పడంతో సుమోటో కేసును మూసివేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. న్యాయవ్యవస్థ గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జస్టిస్ శ్రీశానందపై ప్రొసీడింగ్స్‌ను విరమించుకుంటూ సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లోని ఏ ప్రాంతాన్ని పాకిస్థాన్‌తో పోల్చడం సరికాదని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌ మందలించారు. అది దేశ ప్రాదేశిక సమగ్రతకు విరుద్ధమని పేర్కొన్నారు.

కేసు ఏంటంటే?

ఇటీవల ఓ భూవ్యవహారానికి సంబంధించిన కేసులో హైకోర్టు జడ్జి జస్టిస్‌ వేదవ్యాసాచార్‌ శ్రీశానంద విచారణ చేపట్టారు. ఆ ప్రాంతాన్ని పాకిస్థాన్‌తో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, మహిళా న్యాయవాదిపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కాగా.. సుప్రీంకోర్టు సుమోటో కేసు చేపట్టింది. కోర్టుల్లో జడ్జిలు చేసే వ్యాఖ్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాల్సి ఉందని గతంలోనే తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed