హ్యుందాయ్ మోటార్ ఇండియా IPOకు సెబీ ఆమోదం!

by Harish |   ( Updated:2024-09-25 08:48:44.0  )
హ్యుందాయ్ మోటార్ ఇండియా IPOకు సెబీ ఆమోదం!
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా గత కొంత కాలంగా ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రావాలని చూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి దీనికి సంబంధించిన పత్రాలను దాఖలు చేయగా, తాజాగా ఐపీఓకు సెబీ నుంచి ఆమోదం లభించినట్లు సంబంధిత వర్గాల వారు తెలిపారు. దీని ద్వారా కంపెనీ దాదాపు రూ.25,000 కోట్ల($3 బిలియన్ల)ను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ.10 ముఖ విలువ కలిగిన 14,21,94,700 ఈక్విటీ షేర్లు ఆఫర్-ఫర్-సేల్ (OFS) కింద అందుబాటులో ఉంటాయి.

ఇంతకుముందు 2022లో దేశీయ LIC కంపెనీ 2.7 బిలియన్‌ డాలర్లతో ఇప్పటివరకు దేశీయంగా అతిపెద్ద ఐపీఓగా ఉండగా, హ్యుందాయ్‌ రాకతో ఇది ఇకపై అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది. దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ ఇండియాలో 1996లో కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రస్తుతం మార్కెట్లో 13 మోడళ్లను విక్రయిస్తోంది. దేశీయ కంపెనీలకు గట్టిపోటీని ఇస్తూ, ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడళ్లను లాంచ్ చేస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో, హ్యుందాయ్ IPO ద్వారా కనీసం $3 బిలియన్లను సేకరించాలని చూస్తున్నట్లు నివేదికలు సూచించాయి.

Advertisement

Next Story