- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వైసీపీకి రాజీనామా చేస్తున్నా’.. ఆ పార్టీ నేత సంచలన ప్రకటన
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ(YCP) ఘోర ఓటమి పాలైంది. దీంతో పార్టీ నేతల్లో అసహనం నెలకొంది. ఈ క్రమంలో పలువురు పార్టీ నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీని వీడి అధికార పార్టీలో చేరుతున్నారు. తాజాగా వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ఏ రెహమాన్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
టీడీపీ హయాంలో విశాఖ-1 ఎమ్మెల్యేగా 1994లో గెలిచారు. 2001 నుంచి 2004 వరకు ఉడా ఛైర్మన్‌గా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన.. 2020 మార్చిలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా.. ఆయన మంత్రి లోకేష్ లేదా మంత్రి ఫరూఖ్ సమక్షంలో టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా రెహమాన్ మీడియాతో మాట్లాడుతూ.. ముస్లింల ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం ఎంతో చేస్తోందని చెప్పారు. పాలనలో వైసీపీ అన్ని విధాలుగా విఫలమైందని విమర్శించారు.