ప్రధాని వ్యతిరేక వ్యాఖ్యలను అంగీకరించను: మాల్దీవులు వివాదంపై శరద్ పవార్ స్పందన

by samatah |
ప్రధాని వ్యతిరేక వ్యాఖ్యలను అంగీకరించను: మాల్దీవులు వివాదంపై శరద్ పవార్ స్పందన
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్-మాల్దీవులు మధ్య నెలకొన్న వివాదంపై నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ చీఫ్(ఎన్సీపీ) శరద్ పవార్ స్పందించారు. ఒక దేశ ప్రధానికి వ్యతిరేకంగా మరొక దేశం మాట్లాడితే ఏ దేశమూ అంగీకరించబోదని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. ‘మోడీ దేశానికి ప్రధాని. పీఎం పదవిని మేము గౌరవిస్తాం. ప్రధాన మంత్రికి వ్యతిరేకంగా వేరే దేశం కామెంట్స్ చేస్తే ఊరుకోము’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ మోడీకి మద్దతు తెలపడం గమనార్హం.

Advertisement

Next Story