వ్యాక్సిన్ విషయంలో బలవంతం లేదు.. సుప్రీంకోర్టుకు వెల్లడించిన కేంద్రం

by Disha daily Web Desk |
వ్యాక్సిన్ విషయంలో బలవంతం లేదు.. సుప్రీంకోర్టుకు వెల్లడించిన కేంద్రం
X

న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ విషయంలో ఎటువంటి బలవంతపు చర్యలు లేవని సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. వ్యాక్సిన్ విషయంలో వ్యక్తిగత అంగీకారంతోనే అందిస్తున్నట్లు పేర్కొంది. ప్రత్యేక అవసరాలున్న దివ్యాంగులకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు చూపించడంపై మినహాయించాలని సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిపై ఎలాంటి ఖచ్చితమైన నిబంధనలు జారీ చేయలేదని కేంద్రం కోర్టుకు తెలిపింది.

ఎన్జీవో ఎవారా ఫౌండేషన్ దివ్యాంగులకు ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ ఇచ్చే విషయంపై కేంద్రాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని కోరింది. భారత ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారం సంబంధిత వ్యక్తి అనుమతి లేకుండా బలవంతంగా వ్యాక్సిన్ వేయొద్దని సూచించింది. ప్రస్తుతం కొనసాగుతున్న మహమ్మారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రజాసక్తి మేరకు కరోనా టీకాలు ఇస్తున్నామని అఫిడవిట్‌లో పేర్కొంది. కాగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 157 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేశారు.

Advertisement

Next Story