Canada: కెనడాలో హిందువుల భారీ నిరసన.. ఖలిస్థానీల దాడులపై ఆగ్రహం

by vinod kumar |
Canada: కెనడాలో హిందువుల భారీ నిరసన.. ఖలిస్థానీల దాడులపై ఆగ్రహం
X

దిశ, నేషనల్ బ్యూరో: కెనడాలోని బ్రాంఫ్టన్ నగరం(Bramftan city)లో హిందూ దేవాలయం (Hindu Temple)పై ఖలిస్థానీ (Kalisthaani) మద్దతుదారులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ కెనడాలోని హిందువులు బ్రాంఫ్టన్‌లో మంగళవారం భారీ నిరసన తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 1000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో హిందువులపై హింస పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జస్టిన్ ట్రూడో ప్రభుత్వం వెంటనే నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై కెనడియన్ రాజకీయ నాయకులు, చట్ట అమలు సంస్థలపై ఒత్తిడి తీసుకురావాలని తెలిపారు.

‘హిందూ కెనడియన్లు కెనడాకు చాలా విధేయులు. వారిపై జరుగుతున్న దాడులు సరైనవి కావు. ఈ విషయాన్ని ఇక్కడి రాజకీయ నాయకులందరూ గ్రహించాలి. కెనడా హిందువులకు రక్షణ కల్పించాలి. భారత్, కెనడాల మధ్య సంబంధాలు బలంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం’ అని నిరసనకారులు చెప్పారు. కాగా, బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంలో భక్తుల గుంపును లక్ష్యంగా చేసుకుని ఖలిస్థానీలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, భారత ప్రధాని నరేంద్ర మోడీలతో భారత విదేశాంగ శాఖ, ఒట్టావాలోని భారత్ హైకమిషన్ తీవ్రంగా ఖండించాయి. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు కెనడా పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.

Advertisement

Next Story

Most Viewed