- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
High Court: బెంగాల్‌లో డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో సీబీఐ దర్యాప్తుకు కలకత్తా హైకోర్టు ఆదేశాలు
దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో వైద్య విద్యార్థిని లైంగిక దాడి, హత్య ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోల్‌కతా హైకోర్టు మంగళవారం ఆదేశించింది. అన్ని రకాల పత్రాలను వీలైనంత వెంటనే సీబీఐకి అందజేయాలని పోలీసులకు స్పష్టం చేసింది. బుధవారం ఉదయం 10 గంటల కల్లా సీబీఐకి బదిలీ చేసే ప్రక్రియ ముగించాలని స్పష్టం చేసింది. ఇదే సమయంలో మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ (పీజీటీ) డాక్టర్‌పై సెమినార్ హాలులోనే అమానవీయంగా దాడి జరిగినప్పటికీ ఆసుపత్రిలోనే ఉన్నవారికి తెలియకపోవడం, యాజమాన్యం తీరు పట్ల హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో నిందితుడికి పోలీసులకు మధ్య సంబంధాలు ఉన్నాయనే సందేహాలతో బాధితురాలి తల్లిదండ్రులు సాక్ష్యాలు మారకుండా స్వతంత్ర దర్యాప్తు జరపాలని కోరినట్టు కోర్టు వెల్లడించింది. గతంలో సుప్రీంకోర్టు ఓ కేసు విషయంలో ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తున్నట్టు తెలిపింది. అలాగే, ఈ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా డాక్టర్లు చేస్తున్న నిరసనల విషయమై ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యతను గుర్తు చేస్తూ ఆందోళనలు విరమించాలని సూచించింది. మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ డా సందీప్ ఘోష్ రాజీనామా చేసిన తర్వాత మరో పదవి ఎలా ఇచ్చారని, తక్షణం విధుల నుంచి తప్పించి, సెలవుపై పంపాలని పేర్కొంది. కోల్‌కతా హైకోర్టు నిర్ణయంపై స్పందించిన ఓ వైద్యుడు.. కేసు సీబీఐకి బదిలీ కావడం సంతోషంగా ఉంది. నిందితులు అరెస్ట్ అవుతారనే నమ్మకం కలిగిందన్నారు.