Budget 2024: ఉపాధి, అవకాశాల్లో కొత్త శకాన్ని ప్రారంభించేలా బడ్జెట్ సెట్ చేశారు- అమిత్ షా

by Shamantha N |   ( Updated:2024-07-23 10:07:32.0  )
Budget 2024: ఉపాధి, అవకాశాల్లో కొత్త శకాన్ని ప్రారంభించేలా బడ్జెట్ సెట్ చేశారు- అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటులో కేంద్రఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్(FM Nirmala Sitharaman) బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రజలు, అభివృద్ధి అనుకూల దార్శనిక బడ్జెట్ ఇది అని కేంద్రహోమంత్రి అమిత్ షా(Union Home Minister) అన్నారు. విత్తమంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘భారత్‌ వ్యవస్థాపక శక్తి, వ్యాపారాన్ని సులభతరం చేసి దేశాన్ని ఆర్థిక వృద్ధి వైపు నడిపించే మోడీ సర్కార్‌ నిబద్ధతను ఈ బడ్జెట్‌ తెలియజేస్తోంది. పన్ను విధానం శ్లాబుల్లో మార్పులు, నియమాలను సరళీకృతం చేసింది. దీనిద్వారా పన్ను చెల్లింపుదారులకు కేంద్రం ఉపశమనం అందజేస్తోంది’’ అని అన్నారు. ఉపాధి, అవకాశాల్లో కొత్త శకానికి నాంది పలకడం ద్వారా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారనుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశ ఉద్దేశాన్ని, ఆశావాదాన్ని ఈ బడ్జెట్ ఉదాహరణగా చూపడమే కాకుండా బలపరుస్తుందన్నారు. యువత, నారీ శక్తి, రైతులు ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకుని కొత్త శకానికి నాంది పలికే దిశగా ఈ బడ్జెట్ ఊతమిస్తుందన్నారు.


Click Here For Budget Updates!


Advertisement

Next Story