- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎన్నికల్లో భార్య వర్సెస్ భర్త : ఇల్లు వదిలి వెళ్లిపోయిన భర్త
దిశ, నేషనల్ బ్యూరో : ఫ్యామిలీ పాలిటిక్స్ ఇటీవల కాలంలో బాగానే పెరిగాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కుటుంబ రాజకీయం చాలా ఆసక్తికరమైనది. ఇందులో భార్యాభర్తలు ఇద్దరూ మధ్యప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకులు. భర్త కంకర్ ముంజరే బాలాఘాట్ లోక్‌సభ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. భార్య అనుభా ముంజరే కాంగ్రెస్ ఎమ్మెల్యే. 2023 నవంబరులో బాలాఘాట్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అనుభా ముంజరే విజయఢంకా మోగించారు. ఆమె చేతిలో బీజేపీ సీనియర్ నేత గౌరీశంకర్ బిసెన్ ఓడిపోయారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సామ్రాట్ సరస్వత్ అనే నాయకుడికి బాలాఘాట్ టికెట్ ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అనుభా ముంజరే ..తమ పార్టీ అభ్యర్థికే మద్దతు పలుకుతున్నారు. ఇదే సమయంలో చక్రం తిప్పిన అనుభా ముంజరే భర్త బీఎస్పీ నుంచి లోక్‌సభ టికెట్ తెచ్చుకున్నారు. దీంతో ఎన్నికల ప్రచారంలో ఈ భార్యాభర్తలిద్దరూ ఒకరితో ఒకరు తలపడాల్సి వచ్చింది. ఈనేపథ్యంలో భర్త కంకర్ ముంజరే కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఇంటిని వదిలేసి ఆయన బయటికి వచ్చేశారు. ఏప్రిల్ 19న పోలింగ్ పూర్తయ్యే వరకు తాను ఇంట్లోనే ఉంటే.. ప్రజల్లోకి తప్పుడు అర్థం వెళ్తుందని కంకర్ ముంజరే అంటున్నారు.
భార్యాభర్తలు ఏమంటున్నారు ?
‘‘ఇప్పుడు నా భార్య నాకు రాజకీయ ప్రత్యర్ధి. నా ప్రత్యర్ధిగా బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థికి ఆమె మద్దతు తెలుపుతున్నారు. ఇలాంటి టైంలో నేను ఇంకా ఇంట్లోనే ఉండటం కరెక్టు కాదు. అందుకే బాలాఘాట్ శివార్లలోని ఒక గుడిసెలో ఉంటూ.. నా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాను. నా పార్టీ వేరు, నా సిద్ధాంతాలు వేరు. ఆమె సిద్ధాంతాలు వేరు, పార్టీ వేరు. వేర్వేరు సిద్ధాంతాలు ఒకే గొడుకు కింద ఇమడలేవు. ఎన్నికలయ్యేదాకా ఇంట్లోకి అడుగు పెట్టను. బాలాఘాట్ లోక్‌సభ నుంచి గెలిచేందుకు నా సర్వశక్తులు ఒడ్డుతాను. ఎవరి శక్తియుక్తులు వారికి’’ అన కంకర్ ముంజరే చెప్పుకొచ్చారు. తన భర్త నిర్ణయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుభా ముంజరే స్పందిస్తూ.. ‘‘ఆయన నిర్ణయం నన్ను బాధించింది. భారతీయ ఆడబిడ్డగా నేను చనిపోయేదాకా నా మెట్టినింటిలోనే ఉంటాను. ఎక్కడికీ వెళ్లను’’ అని స్పష్టం చేశారు. ‘‘గత అసెంబ్లీ ఎన్నికల్లో మా ఆయన పరస్వాడ అసెంబ్లీ స్థానం నుంచి గోండ్వానా గంతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన టైంలో నేను కాంగ్రెస్ టికెట్‌పై బాలాఘాట్ నుంచి పోటీ చేశాను. అయినా అప్పట్లో మేం కలిసే ఉన్నాం. మా వివాహ జీవితానికి 33 సంవత్సరాలు పూర్తయ్యాయి. మాకు ఒక కొడుకు కూడా ఉన్నాడు’’ అని అనుభా ముంజరే తెలిపారు. ‘‘నేను ఎన్నికల ప్రచారంలోనూ నా భర్త గురించి తప్పుగా మాట్లాడను. మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు శాయశక్తులు ప్రయత్నం చేస్తాను’’ అని ఆమె తేల్చి చెప్పారు.