- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BREAKING: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రమూకల కాల్పులు.. నలుగురు జవాన్ల వీర మరణం
దిశ, వెబ్‌డెస్క్: దేశ సరిహద్దులో భద్రతా దళాలు 24 గంటలు పహారా కాస్తున్నా టెర్రరిస్టుల చొరబాట్లు ఏమాత్రం ఆగడం లేదు. అక్రమంగా దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తూ.. అడ్డంగా దొరికిపోయిన ఉగ్రమూకలు ఏమాత్రం వెనుకాడకుండా సైన్యంపై కాల్పులకు తెగబడుతున్నాయి. ఈ క్రమంలోనే జమ్ముకాశ్మీర్‌లోని దేసా ప్రాంతంలో సోమవారం అర్థరాత్రి దాటాక భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పుల మోత మోగించారు. టెర్రరిస్టులు సంచరిస్తున్నారనే ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం మేరకు దేసా అడవుల్లో భారత ఆర్మీ, జమ్ముకాశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. టెర్రరిస్ట్‌ల ఏరివేతకు అదనపు బలగాలను సైతం మోహరించారు. ఈ క్రమంలోనే గాలింపు చర్యలను ముమ్మరం చేయగా ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు వీర మరణం పొందారు. అందులో ఓ ఆర్మీ ఆఫీసర్ కూడా ఉన్నారని స్థానిక పోలీసులు వెల్లడించారు. అయితే, టెర్రరిస్టులు, ఇండియన్ ఆర్మీ్కి మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.