- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ఎన్నికల వేళ కర్ణాటకలో సంచలనం.. రూ.100 కోట్ల భారీ లిక్కర్ డంప్ స్వాధీనం
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఆయా రాజకీయా పార్టీలు మద్యం, డబ్బు, బహుమతులు, చీరలు, ఇతర వస్తువులను ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తాయిలాలుగా పంచి పెడుతున్నారు. అయితే, వాటన్నింటికీ అడ్డుకట్ట వేసేందుకు దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ.. రూ.కోట్లను సీజ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా కర్ణాటకలో పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న దాదాపు రూ.100 కోట్ల విలువైన లిక్కర్ డంప్‌ను పోలీసులు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. చామరాజనగర్ పార్లమెంటు పరిధిలోని మైసూరు జిల్లా నంజనగూడు తాలూకాలోని తాండ్యా ఇండస్ట్రియల్ ఏరియాలోని యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ యూనిట్‌ను ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టీం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు ప్లాంట్ అంతా జల్లెడ పట్టగా అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు రూ.98.52 కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, లోక్‌సభ ఎన్నికల వేళ ఇంత పెద్ద ఎత్తున మద్యం డంప్ పోలీసులు స్వాధీనం చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.