- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్ న్యూస్.. మనీష్ సిసోడియా పై మరో కొత్త అవినీతి కేసు నమోదు
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అయిన మనీష్ సిసోడియా పై తాజాగా మరో కొత్త కేసు నమోదైంది. ఢిల్లీ ప్రభుత్వ ‘ఫీడ్‌బ్యాక్ యూనిట్’లో అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ అతని కేసు నమోదు చేసింది. . . సీబీఐ చర్యపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. తన మాజీ డిప్యూటీ మనీష్‌పై అనేక తప్పుడు కేసులు బనాయించి సుదీర్ఘకాలం కస్టడీలో ఉంచాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ ప్లాన్ అని అన్నారు.
కాగా మనీష్ సిసోడియాతో సహా మొత్తం ఏడుగురిపై సీబీఐ కేసు ఫైల్ చేసింది. సిసోడియాను ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్ర హోం మంత్రిత్వశాఖ అనుమతి ఇచ్చిన కొన్ని రోజుల తర్వాత సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఇందులో భాగంగా ఏడుగురిపై నేరపూరిత కుట్ర, ఆస్తుల దుర్వినియోగం, ప్రభుత్వోద్యోగి ద్వారా విశ్వాస ఉల్లంఘన, ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్లను నిజమైన పత్రాలుగా ఉపయోగించడం, ఖాతాలను తప్పుగా మార్చడం వంటి అభియోగాలతో సీబీఐ కేసు నమోదు చేసింది.
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, అప్పటి ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ సెక్రటరీ సుకేష్ కుమార్ జైన్, సీఐఎస్ఎఫ్ రిటైర్డ్ డీఐజీ రాకేష్ కుమార్ సిన్హా, అప్పటి ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారు, జాయింట్ డైరెక్టర్ (ఎఫ్‌బీయూ)పై కేసు నమోదైంది. అయితే, 2015లో ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆప్ ఎఫ్‌బీయూని ఏర్పాటు చేసింది. ఫీడ్‌బ్యాక్ యూనిట్‌ను చట్టవిరుద్ధంగా సృష్టించడం, పని చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 36 లక్షల వరకు నష్టం వాటిల్లిందని సీబీఐ పేర్కొంది.
Read more:
లిక్కర్ స్కాం కేసు : కవిత ప్రతినిధి సోమా భరత్ కీలక వ్యాఖ్యలు