BREAKING: లోక్‌సభ ఎన్నికల లోగోను ఆవిష్కరించిన ఈసీ

by Shiva |
BREAKING: లోక్‌సభ ఎన్నికల లోగోను ఆవిష్కరించిన ఈసీ
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోలింగ్ నిర్వహణకు భారత ఎన్నికల సంఘం ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకపోయినా.. ఏప్రిల్ రెండో వారంలో ఎన్నికలు జరుగొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం ఇవాళ 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి లోగో, ట్యాగ్‌లైన్‌ను అవిష్కరించింది. ఎలక్షన్ ట్యాగ్ లైన్ ‘చునావ్ కా పర్వ్, దేశ్ కా గర్వ్’( ఎన్నికల పండగ దేశానికి గర్వ కారణం) అని పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల సమరంలో భాగంగా ఇప్పటికే ఆయా జాతీయ, ప్రాంతీయ పార్టీలు కదనరంగంలోకి దిగాయి.

ముచ్చటగా మూడోసారి అధికారి చేబట్టి హ్యట్రిక్ కొట్టాలని బీజేపీ తహతహలాడుతుంటే.. విపక్షాలు తమ బలాన్ని కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ, దురదృష్టవశాత్తు వారి కుటమిలో కుంపటి రగిలింది. ఇప్పటికే, పశ్చిమ బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరితోనూ పొత్తు లేకుండా పోటీలో దిగుతున్నట్లుగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వెల్లడించారు. ఇక కూటమిలో మరో ప్రధాన పార్టీ అయిన జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మళ్లీ బీజేపీతో జతకట్టేందుకు పావులు కదుపుతుండటంతో ఇండియా కూటమి దాదాపుగా విచ్ఛిన్నమైనట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


Advertisement

Next Story

Most Viewed