- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: జపాన్‌లో తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విఫలం.. లిఫ్ట్ ఆఫ్ అవ్వగానే భారీ పేలుడు, రూ.కోట్లలో నష్టం (వీడియో వైరల్)
దిశ, వెబ్‌డెస్క్: టోక్యోకు చెందిన వాణిజ్య సంస్థ స్పేస్ వన్ ప్రయోగించిన కైరోస్ రాకెట్ లిఫ్ట్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే పేలిపోయింది. దీంతో జపాన్ యొక్క మొట్టమొదటి ప్రైవేటు రంగ రాకెట్ ప్రయోగ ప్రయత్నం విఫలమైంది. కైరోస్ రాకెట్ అనేది అతి చిన్న ఘన పదార్థంతో నడిచే ఇంధన రాకెట్. ఒకవేళ ఈ ప్రయోగం విజయవంతమై ఉంటే ఘన పదార్థ ఇంధన రాకెట్‌ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టిన మొదటి జపనీస్ ప్రైవేట్ కంపెనీగా స్పేస్ వన్ అవతరించేది. అయితే, ఇవాళ తెల్లవారుజామున 2:01 గంటలకు రాకెట్ పైకి లేచి, కొన్ని సెకన్ల తర్వాత పేలిపోయిందని స్పేస వన్ ప్రధినిధులు మీడియాకు వెల్లడించారు. ఈ ప్రయోగం విఫలం అవ్వడంతో స్పెస్ వన్ సంస్థకు రూ.కోట్లలో నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. రాకెట్ ఎగురుతున్న సమయంలోనే భారీ పేలుడు సంభవించింది. అదేవిధంగా లాంచ్ ప్యాడ్ వద్ద ధట్టమైన పొగ, మంటలు వెలువడ్డాయి. ప్రస్తుతం అందుకు సంబంధించి వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
BREAKING: Space One rocket explodes during launch from southern Japan pic.twitter.com/8IWiu2bRKa
— BNO News (@BNONews) March 13, 2024