BREAKING: ముంబైలో కూలిన హోర్డింగ్..14కు చేరిన మృతుల సంఖ్య, కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం ఏక్‌నాథ్ షిండే

by Shiva |
BREAKING: ముంబైలో కూలిన హోర్డింగ్..14కు చేరిన మృతుల సంఖ్య, కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం ఏక్‌నాథ్ షిండే
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబై నగరంలోని ఘాట్‌కోపర్‌లో బలమైన గాలులకు ఓ భారీ హోర్డింగ్ నేలకూలింది. ఈ ప్రమాదంలో సోమవారం 8 మంది మృతి చెందారని, 60 మందికిపైగా గాయపడ్డారు. అయితే, తాజాగా మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు 14 మంది చనిపోగా.. 74 మంది గాయపడినట్లుగా తెలుస్తోంది. అందులో కొందరు స్పల్పంగా గాయాలు కాగా, మరికొందరు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందజేస్తున్నారరు. విషయం తెలుసుకున్న మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును అక్కడున్న వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చుతో చికిత్స అందిస్తామని, మృతులకు రూ.5 లక్షల పరిహారాన్ని ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రమాదానిక కారణమైన బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ముంబై మహా నగరంలో ఎక్కడ హోర్డింగ్‌లు ఏర్పాటు చేసినా ఆడిట్ చేయాలంటూ అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story